Theaters Bundh : సినిమాను ఆపేస్తారా? అయితే క్లయిమాక్స్ ఇలా ఉంటుందట భయ్యా?
జూన్ ఒకటోతేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తుంది.
జూన్ ఒకటోతేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తుంది. జూన్ పన్నెండో తేదీన పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీని వెనక నలుగురు ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇందుకు పవన్ కల్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకతతో ఉన్న ఈ నలుగురు థియేటర్ల బంద్ కు కారణమి గుర్తిస్తున్నారు.
నేరుగా విభేదించకపోయినా...
ఇందులో ఒకరు పవన్ కల్యాణ్ తో నేరుగా విభేదాలు లేకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయిన వారు ఒకరు కీలకంగా వ్యవహరించారన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరంలో తమకు జరిగిన నష్టంపై కనీసం పవన్ కల్యాణ్ సినీ ఇండ్రస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినా తమకు మద్దతు తెలపకపోవడంపై ఆయనే ఈ నిర్ణయం వెనక ఉన్నారని అనుమానం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూటమి ప్రభుత్వంతో పాటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేకంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కావాలని చేసినట్లున్న ఈ నిర్ణయం వెనక ఎవరెవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
తనిఖీలు చేసే ఛాన్స్...
అందుకే ప్రేక్షకుల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెవెన్యూతో పాటు తూనికల కొలతల శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తూనికలు-కొలతలు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ విషయమై మంత్రులు మనోహర్, దుర్గేష్‌లతో పవన్ కల్యాణ్ తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. త్వరలో హోం, వాణిజ్యపన్నులు, రెవెన్యూ మంత్రులతోనూ చర్చించనున్న మంత్రులు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ థియేటర్లలో టికెట్, ఆహార పదార్థాల ధరలపై ఆరా తీయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.కేవలం కొందరి నిర్ణయాలపై ఆధారపడి ఇలా చేయడం తగదని కూడా సూచిస్తున్నారు.
ఆ థియేటర్లపై...
అందుకే ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రధానంగా వెనకున్న వారి థియేటర్లపై ఈ దాడులు చేయాలని నిర్ణయం జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఉన్న థియేటర్లన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయి. ఆ విషయం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అసలు థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి టిక్కెట్ ధరతో పాటు అక్కడ విక్రయించే వస్తువులని తెలుసుకునేలా గుణపాఠం చెప్పాలని, ఈ నలుగురి తెరవెనక బాగోతానికి క్లైమాక్స్ చూపించాలని పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితులైన వారు డిసైడ్ అయ్యారట. పవన్ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకపోయినా జనసేనకుచెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు.