డీఏవీ స్కూలు ఘటనపై స్పందించిన చిరంజీవి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్

నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలచివేసినట్టు వెల్లడించారు. ఆటవిక సంస్కృతి

Update: 2022-10-26 03:19 GMT

హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవరైన రజనీకుమార్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలియడంతో.. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై డ్రైవర్ చేస్తున్న దారుణాలు ప్రిన్సిపల్ తెలియకుండానే ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలచివేసినట్టు వెల్లడించారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News