ఇళయరాజాకు జీఎస్టీ నోటీసులు

తాజాగా జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఇళయరాజాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.1.80 కోట్ల పన్ను కట్టాలంటూ చెన్నై జీఎస్టీ

Update: 2022-04-26 11:53 GMT

చెన్నై : మ్యూజిక్ మెజిషియన్ ఇళయరాజాకు మరో షాక్ తగిలింది. ఇటీవలే ఆదాయపన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఇళయరాజాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.1.80 కోట్ల పన్ను కట్టాలంటూ చెన్నై జీఎస్టీ మంగళవారం నోటీసులిచ్చింది. పన్నుకు వడ్డీ, జరిమానా కలిపి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

కాగా.. పన్ను చెల్లింపుల విషయమై ఇళయరాజాకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. కానీ ఆయన స్పందించలేదు. దాంతో చెన్నై జీఎస్టీ మరోమారు నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ నోటీసులతో ఇళయరాజాకు ఎంపీ పదవి కేటాయింపు ప్రచారానికి తెరపడినట్లైంది. ఇటీవల ఇళయరాజా ప్రధాని మోదీని అంబేద్కర్‌తో పోల్చి మాట్లాడారు. ఆయనకు త్వరలో రాజ్యసభ ఎంపీ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. జీఎస్టీ నోటీసుల జారీతో ఆ ప్రచారానికి తెరపడింది.


Tags:    

Similar News