తల్లి కాబోతోన్న ప్రముఖ నటి.. ఫోటో షేర్ చేస్తూ ఇలా !

నాలుగు చేతులు.. రెండు హృదయాలు.. మేము చేయగలిగినంత ఉత్తమంగా మిమ్మల్ని పెంచడానికి, ప్రతి అడుగులో మీకు ప్రేమ, సపోర్ట్..

Update: 2022-03-21 10:01 GMT

న్యూ ఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె.. ఓ ఫోటోను షేర్ చేస్తూ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 2018లో ఆనంద్ అహుజా ను పెళ్లాడిన సోనమ్.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన సోనమ్ కపూర్ అహుజా ఇప్పుడు గర్భిణి. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ.. నీకు వెల్కమ్ చెప్పేందుకు మేము ఆతృతగా ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చింది.

"నాలుగు చేతులు.. రెండు హృదయాలు.. మేము చేయగలిగినంత ఉత్తమంగా మిమ్మల్ని పెంచడానికి, ప్రతి అడుగులో మీకు ప్రేమ, సపోర్ట్ ను అందించే ఒక కుటుంబం.. మేము మిమ్మల్ని స్వాగతించడానికి వేచి ఉండలేము" అంటూ సోఫాపై కూర్చున్న తన భర్త ఆనంద్ అహుజా ఒడిలో పడుకున్న ఫోటోలను షేర్ చేసింది సోనమ్. ఆమె అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Tags:    

Similar News