దాని వలన ఉపయోగం ఎంత?
బిగ్ బాస్ లోకి వచ్చేవాళ్లంతా క్రేజ్ సంపాదించి కెరీర్ లో బిజీ అవుదామనుకుని హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వారు గేమ్ ఆడకుండా జెన్యూనిటీ చూపిస్తూ… [more]
బిగ్ బాస్ లోకి వచ్చేవాళ్లంతా క్రేజ్ సంపాదించి కెరీర్ లో బిజీ అవుదామనుకుని హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వారు గేమ్ ఆడకుండా జెన్యూనిటీ చూపిస్తూ… [more]
బిగ్ బాస్ లోకి వచ్చేవాళ్లంతా క్రేజ్ సంపాదించి కెరీర్ లో బిజీ అవుదామనుకుని హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వారు గేమ్ ఆడకుండా జెన్యూనిటీ చూపిస్తూ… ఉంటె ఒకే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండేవారికి కొంతమందికి మంచి పేరొస్తే… మరోకొంతమందికి ప్రేక్షకుల నుండి వ్యతిరేఖత మొదలవుతుంది. అయితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వాళ్ళ కెరీర్ పరుగులు పెడుతుంది అనుకుంటే… ఆబ్బె అలాంటిదేం లేదు.. ఎప్పటిలాగే కెరీర్ ఉంటుంది అని ఈజ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ, సీజన్ 2 విన్నర్ కౌశల్ నిరూపించారు. శివబాలాజీ ఎప్పటిలాగే కేరెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతుంటే… కౌశల్ ఏదో కౌశల్ ఆర్మీ, దర్శకత్వం అంటూ హడవిడి తప్ప.. మరేం లేదు.
తాజాగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. ఇపప్టివరకు ఒకటో అర పాటలతో హైలెట్ అయిన రాహుల్.. బిగ్ బాస్ విన్నర్ అయిన తరవాత కెరీర్ పరుగులుపెడుతుంది అని.. కెరీర్ లో పిచ్చ బిజీ అవుతానని అనుకుంటున్నాడు. మరి మిగతా ఇద్దరి విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు రాహుల్ విషయంలోనూ అదే జరుగుతుంది అంటున్నారు కొందరు. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ కి కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయో.. లేదంటే వాళ్ళకి లాగే రాహుల్ కూడా అక్కడక్కడా మెరవడం అంటే.. ఏ షాప్ ఓపెనింగ్ లోనో… లేదంటే మారేదన్నా ఈవెంట్ లోనో మెరవడం తప్ప బిగ్ బాస్ విన్నింగ్ టైటిల్ వలన ఉపయోగం ఏమిటో అప్పుడే తెలియదు.