7 మిలియన్లకు పైగా వ్యూస్ తో.. నెంబర్ 1 ట్రెండింగ్ లో బాలయ్యతో బాహుబలి ప్రోమో

బాహుబలి ప్రోమో.. యూట్యూబ్ లో 3.6 మిలియన్ వ్యూస్ తో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ప్రోమోలో ప్రభాస్ పెళ్లి టాపిక్ రాగా..

Update: 2022-12-18 06:18 GMT

prabhas promp

అటు ప్రభాస్.. ఇటు బాలయ్య ఫ్యాన్స్.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాహుబలి ప్రోమో రానే వచ్చింది. ఇప్పటికే ఈ బాహుబలి ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు, ప్రభాస్, గోపీచంద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలవ్వగా.. ఎపిసోడ్ పై అంచనాలు నెలకొన్నాయి. బాహుబలిని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు ? బాహుబలి ఏం చెప్పారు ? పెళ్లి ప్రస్తావనపై బాహుబలి మనసులో మాటేంటి ? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. శనివారం రాత్రి విడుదలైన బాహుబలి విత్ బాలయ్య ప్రోమో రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోంది. యూట్యూబ్ + డిజిటల్ వ్యూస్ ఇప్పటికవరకూ 7 మిలియన్లకు పైగా వచ్చాయని ఆహా ట్వీట్ చేసింది.

బాహుబలి ప్రోమో.. యూట్యూబ్ లో 3.6 మిలియన్ వ్యూస్ తో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ప్రోమోలో ప్రభాస్ పెళ్లి టాపిక్ రాగా.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత చేసుకుంటా అని చెప్పాలంటూ.. ప్రభాస్ సమాధానమిచ్చారు. వింటేజ్ ప్రభాస్ ను చూసి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. గోపీచంద్, ప్రభాస్ మధ్యలో ఫోన్ లో రామ్ చరణ్ లు చేసిన అల్లరితో కట్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కు కాబోయే ఆ రాణి ఎవరంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. బుజ్జిగాడు స్లాంగ్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రోమోకి హైలెట్ గా నిలిచింది. ఈ బాహుబలి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ఆహా టీమ్ ప్రకటించింది. ప్రోమోకే ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందంటే.. ఎపిసోడ్ ఒక కొత్త రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

Full View

Tags:    

Similar News