సింగిల్ డైలాగ్ తో.. బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ గ్లింప్స్, #1 ట్రెండింగ్

ప్రభాస్ బాలయ్య టాక్ షోకి వస్తున్నారంటూ.. ఇటీవలే కొన్ని ఫోటోలను విడుదల చేసింది ఆహా. ఇక తాజాగా ప్రభాస్ ఎంట్రీపై ఫస్ట్..

Update: 2022-12-14 07:12 GMT

కొద్దిరోజులుగా.. బాహుబలి విత్ బాలయ్య అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ ఓటీటీ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ 2. ఈ షో తో సినిమాల్లోనే కాదు.. ఇంటర్వ్యూల్లోనూ సరికొత్త రేర్ కాంబినేషన్స్ వస్తాయని చూపించారు. చంద్రబాబు-లోకేష్ లతో ప్రారంభమైన అన్ స్టాపబుల్ 2.. ఇప్పటి వరకూ పొలిటీషియన్స్, సినీ నిర్మాతలు, దర్శకులు, యంగ్ హీరోలను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. ఈ షోకు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసే హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు.

ప్రభాస్ బాలయ్య టాక్ షోకి వస్తున్నారంటూ.. ఇటీవలే కొన్ని ఫోటోలను విడుదల చేసింది ఆహా. ఇక తాజాగా ప్రభాస్ ఎంట్రీపై ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది ఆహా. దానిపై ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల ఈలలు, గోలల మధ్య ప్రభాస్ ఎంట్రీని చూపించారు. అలాగే రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్ అంటూ సింగిల్ డైలాగ్ వదిలారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటు అతని స్నేహితుడు, కో స్టార్, హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఈ షోలో ప్రభాస్ పెళ్లి టాపిక్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
అన్ స్టాపబుల్ 2 లో పెళ్లి టాపిక్ పై కొద్దిసేపు చర్చ జరిగిందట. పెళ్లెప్పుడని బాలయ్య అడగ్గా.. ప్రభాస్ ఎప్పటిలాగే త్వరలో చేసుకుంటానని చెప్పగా.. వచ్చే రెండు నెలల్లో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చరణ్ చెప్పారని వార్తలొస్తున్నాయి. గోపీచంద్ కూడా ఇదే చెప్పారట. మరి ఈ షోకి గోపీచంద్, ప్రభాస్ లతో పాటు రామ్ చరణ్ కూడా వచ్చారా ? అన్నది తెలియదు. త్వరలోనే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తుందని ఆహా చెబుతోంది.

Full View

Tags:    

Similar News