Anupama Parameswaran: అనుపమ చేస్తుంది నచ్చడం లేదు.. బాధతో అభిమాని..
అనుపమ నువ్వు చేస్తుంది ఏం నచ్చడం లేదంటూ అభిమాని ఆవేదన వీడియో.
Anupama Parameswaran, Anupama Parameswaran Photos, Tillu Square
Anupama Parameswaran : మలయాళ పరిశ్రమ నుంచి తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్, అఆ, శతమానంభవతి లాంటి చిత్రాలతో పక్కింటి అమ్మాయిలా తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్న అనుపమ.. సినిమాల్లో, సోషల్ మీడియాలో స్కిన్ షో చేయకుండా పద్దతిగా కనిపిస్తూ వచ్చింది. దీంతో తెలుగు కుర్రాళ్లకు అనుపమ మరింత నచ్చేసింది.
అయితే ఇప్పుడు ఏమైందో ఏమిటో.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ హాట్ షో చేయడం, సినిమాల్లో కూడా స్కిన్ షో చేస్తూ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోతుంది. ఇక ఇవన్నీ చూసిన అనుమప ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇన్నాళ్లు ఆమెను సావిత్రి, సౌందర్య జాబితాలో చూసుకున్న అభిమానులు.. ఇప్పుడు సడన్ గా రూట్ మార్చిన అనుపమని చూసి తెగ ఫీల్ అయ్యిపోతున్నారు.
ఇటీవల రిలీజైన 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ చూసిన తరువాత మరింత హర్ట్ అయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. అనుపమ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. తాజాగా ఒక అభిమాని అయితే వీడియో మెసేజ్ ని షేర్ చేసాడు. "ఒకప్పటి నీ సినిమాలు చూసి సావిత్రి గారు, సౌదర్య గారిలా నిన్ను అభిమానించాము. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది మాకు అసలు నచ్చడం లేదు" అంటూ ఆ అభిమాని తన ఆవేదనని వ్యక్తం చేసాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.