అంకిత ఇంట్లో తీవ్ర విషాదం

బాలీవుడ్ నటి, దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే

Update: 2023-08-12 17:28 GMT

బాలీవుడ్ నటి, దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే కుటుంబంలో విషాదం నెలకొంది. అంకిత లోఖండే తండ్రి, శశికాంత్ లోఖండే, ఆగస్ట్ 12, 2023న మరణించారు. ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన వయస్సు 68. ఆగస్టు 13, 2023న ఉదయం 11 గంటలకు ఓషివారా శ్మశానవాటికలో శశికాంత్ లోఖండే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. అంకిత తన తండ్రి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

అంకిత కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో నివసిస్తూ ఉంది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే వృత్తిరీత్యా బ్యాంకర్. అంకితా ఏక్తా కపూర్ సీరియల్ పవిత్ర రిస్తాలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చింది. ఆ సీరియల్ ఆమెకు ఇంటి పేరుగా మారింది. అర్చన అనే క్యారెక్టర్ తో పాపులారిటీని దక్కించుకుంది. అంకితా లోఖండే 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కొన్నాళ్ళు ప్రేమలో ఉంది అంకిత. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత సుశాంత్ సింగ్ రియా చక్రవర్తితో ప్రేమలో పడగా అంకిత విక్కీ జైన్ ను వివాహం చేసుకుంది. ఇక శశికాంత్ లోఖండే మరణం గురించి అంకిత కానీ ఆమె భర్త విక్కీ జైన్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Tags:    

Similar News