హీరోల రహస్య మంతనాలు ఫలించాయి

టాలీవుడ్ లో ఇద్దరు హీరోల రహస్య మంతనాలు అంటూ ఈమధ్యన కొన్ని వార్తలు వెబ్ మీడియాని చుట్టేశాయి. సంక్రాంతికి పోటీ పడుతున్న అల వైకుంఠపురములో హీరో అల్లు [more]

Update: 2019-11-10 03:26 GMT

టాలీవుడ్ లో ఇద్దరు హీరోల రహస్య మంతనాలు అంటూ ఈమధ్యన కొన్ని వార్తలు వెబ్ మీడియాని చుట్టేశాయి. సంక్రాంతికి పోటీ పడుతున్న అల వైకుంఠపురములో హీరో అల్లు అర్జున్, సరిలేరు నీకెవ్వరూ సినిమా హీరో మహేష్ బాబులకు కలిపి నిర్మాత దిల్ రాజు ఓ రహస్య మీటింగ్ ఏర్పాటు చేసాడని…..దాని ఫలితం ఒకే రోజు రావాల్సిన ఇద్దరు హీరోలలో ఒకరు వెనక్కి తగ్గినట్టుగా టాక్ వినబడింది. మహేష్ – అల్లు అర్జున్ లు మాట్లాడుకుని ఎవరో ఒకరు కాస్త పట్టు విడుపు సూత్రం పాటిస్తే.. నిర్మాతలు బయ్యర్లు సేఫ్ అవుతారని మాట్లాడుకుని జనవరి 12 న రావాల్సిన మహేష్, అల్లు అర్జున్ లలో మహేష్ బాబు జనవరి 11 కి సరిలేరు నీకెవ్వరూ సినిమాని ప్రీ పోన్ చేసుకుంటే… అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ముందు చెప్పిన డేట్ జనవరి 12 కి ఫిక్స్ అయ్యాడట.

మరి రహస్య మంతనాలు పని చేసి ఇలా ఈ ఇద్దరు హీరోలు నిర్మాతలను నష్టపోకుండా కాపాడినట్లే. అయితే అల్లు అర్జున్ తగ్గి తన సినిమాతో ముందుగా రావడానికి ఒప్పుకున్నాడనుకున్నారు ముందు. ఎందుకంటే రీసెంట్ గా విడుదల చేసిన అల వైకుంఠపురములో పోస్టర్స్ లో విడుదల తేదీ వెయ్యకపోయేసరికి చాలా మంది అల్లు అర్జున్.. మహేష్ లలో అల్లు అర్జున్ అల అకుంఠపురములో సినిమా డేట్ మార్చేలా ఉన్నాడనుకున్నారు. చివరికి మహేష్ తగ్గడానే టాక్ వినబడుతుంది. త్వరలోనే మహేష్ సరిలేరు కొత్త డేట్ ప్రకటిస్తారట నిర్మాతలు.

Tags:    

Similar News