30 ఇయర్స్ ఇండస్ట్రీ పై మరక పడింది!

Update: 2016-10-10 07:04 GMT

నటుడిగా దాదాపు దశాబ్ద కాలం తరువాత వెలుగులోకి వచ్చిన నటుడు పృథ్వి రాజ్. క్రిష్ణ వంశి దర్శకత్వం వహించిన ఖడ్గం చిత్రంలో తాను పలికే "30 ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మ ఇక్కడ" అనే సంభాషణతో గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హాస్య నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు పృథ్వి రాజ్. ఒకప్పుడు బ్రహ్మానందం అనుభవించిన స్టార్ కమెడియన్ హోదా ఇప్పుడు పృథ్వి రాజ్ అనుభవిస్తున్నారు. దర్శక రచయితలు బ్రహ్మానందాన్ని పక్కన పెట్టి ఆయనకు రాసే పాత్రలను పృథ్వి రాజ్ కి రాస్తుండటం ప్రస్తుత పరిశ్రమలో పృథ్వి రాజ్ స్థాయికి నిదర్శనం.

అయితే మనకి పృథ్వి రాజ్ హాస్యం పండించి నవ్వులు పంచే కోణంలో మాత్రమే పరిచయం. తనకు పృథ్వి రాజ్ లోని మోసపూరిత కోణం కూడా తెలుసునని తన బాధ వెళ్లబుచ్చుకుని హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది ఓ మహిళ. పృథ్వి రాజ్ తనను వివాహమాడి ఇప్పుడు చట్ట విరుద్ధం ఐన తెగతెంపులు చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని పృథ్వి రాజ్ పై 498ఏ మరియు 420 సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు ఆ ఫిర్యాదు చేసిన మహిళ వివరాలు, ఆ ఫిర్యాదులో చేసిన ఆరోపణలలో వాస్తవాలు ఎంత అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

గతంలోనూ సినిమా ప్రముఖులు ఎందరో వివిధ రకాల కేసులలో నిజ జీవితంలో పోలీస్ స్టేషన్ల గుమ్మం తొక్కారు. నటుడు నందమూరి బాల క్రిష్ణ, నిర్మాత రామోజీ రావు, దర్శకుడు శ్రీను వైట్ల ఇలా ఈ జాబితా పెద్దదే. ఇప్పుడు ఆ జాబితాలోకి హాస్య నటుడు పృథ్వి రాజ్ కూడా చేరటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Similar News