వామ్మో.. అంత స్పీడా?
జపాన్ లో ఇంటర్నెట్ కు సంబంధించి మరో సంచలనం నమోదైంది.
జపాన్ లో ఇంటర్నెట్ కు సంబంధించి మరో సంచలనం నమోదైంది. సెకనుకు 1.02 పెటాబిట్ల డేటాను ట్రాన్స్ఫర్ చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటి వరకూ చేసిన వాటన్నిటినీ ఒక సెకనులో డౌన్‌లోడ్ చేయవచ్చట. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ- ఫొటానిక్ నెట్‌వర్క్ లేబరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. 8 వేల వీడియోలను ఒక సెకనులో డౌన్‌లోడ్ చేసే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతం. భారత్‌లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 ఎంబీపీఎస్ కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువగా నమోదైంది. జపాన్ ఇంటర్నెట్ స్పీడు అమెరికా కంటే 35 లక్షల రెట్లు ఎక్కువని తేలింది.