ఈ రేంజిలో దూసుకుపోతుందా.. 7 సెకెన్లలో 600 కిలోమీటర్ల వేగం

విమానంలో కంటే ఈ ట్రైన్ లోనే వేగంగా వెళ్లొచ్చట. అది చైనాలో సాధ్యమైంది.

Update: 2025-07-16 10:45 GMT

china

విమానంలో కంటే ఈ ట్రైన్ లోనే వేగంగా వెళ్లొచ్చట. అది చైనాలో సాధ్యమైంది. హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన చైనా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా విమానంతో పోటీ పడే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది. గంటకు అత్యధికంగా 600 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదు ఈ రైలు. బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్‌ రైల్వేస్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమంలో సరికొత్త మ్యాగ్లెవ్‌ మోడల్ రైలును చైనా ప్రదర్శించింది.


7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల

ఈ ట్రైన్‌ కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌ టెక్నాలజీతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ సాంకేతికత వ్యతిరేక అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకొని ట్రాక్‌ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. ఈ ఏడాది జూన్‌లో దీన్ని పరీక్షించగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.

Tags:    

Similar News