Cyclones Names: తుఫాన్ల పేర్లు పెట్టడంలో నిబంధనలు ఏంటో తెలుసా?

తుఫాన్లు వచ్చినప్పుడల్లా వాటి పేర్లను చూస్తే వింతగా ఉంటాయి. ఆశ్చర్యపోకమానదు. ఎందుకంటే వాటి పేర్లను చూస్తే..

Update: 2023-12-05 14:23 GMT

తుఫాన్లు వచ్చినప్పుడల్లా వాటి పేర్లను చూస్తే వింతగా ఉంటాయి. ఆశ్చర్యపోకమానదు. ఎందుకంటే వాటి పేర్లను చూస్తే అసలు తుఫాన్లకు పేర్లు పెట్టేదెవరన్న అనుమానాలు వస్తుంటాయి. మిచౌంగ్ తుఫాను ప్రభావం చూస్తే క్రమంగా బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు. అయితే ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడంలో కూడా నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి చేశాయి దేశాలు. మరి ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందో చూద్దాం.

➦ ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు అవకాశం లేదు.

➦ సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం తప్పనిసరి.

➦ తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఉండకుండా చూడాలి.

➦ ఈ తుఫాన్ల పేర్లుపలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి.

➦ ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.

➦ పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.

➦ సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.

➦ ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు.

➦ ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒక్కసారి మాత్రమే వాడాలి. మరోసారి వాడకూడదు.

Tags:    

Similar News