పాకిస్తాన్ - ఆప్ఘనిస్తాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం

ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది.

Update: 2026-03-03 12:16 GMT

ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది. వాయవ్య ప్రాంతాల్లో మరో పలుచోట్ల కాల్పులు జరిపింది. దీంతో ఉగ్రరూపం దాల్చిన ఘర్షణల్లో 67 మంది అఫ్ఘాన్ భద్రతా సిబ్బంది, ఒక పాకిస్థాన్ సైనికుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇరుదేశాల మధ్య పోరు వరుసగా ఐదో రోజుకు చేరింది. పాకిస్థాన్ సమాచారం మంత్రి అత్తౌల్లా తరార్ మాట్లాడుతూ అఫ్గాన్ దాడులను తమ సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు.తరార్ వివరాల ప్రకారం, అఫ్గాన్ దళాలు బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని అనేక జిల్లాల్లో పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేశాయి. ప్రతిదాడుల్లో 27 మంది అఫ్గాన్ సిబ్బందిని హతమార్చినట్లు తెలిపారు.

సరిహద్దుల వెంట...
వాయవ్యంలోని ఖైబర్ పాఖున్హావాసరిహద్దు ప్రాంతాల్లో ఇరవై ఐదు చోట్ల అప్ఘాన్ దళాలు దాడులు ప్రారంభించాయని, అక్కడ నలబై మంది అఫ్ఘాన్ భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు వెల్లడించారు.పాకిస్థాన్ ప్రకటించిన ఈ సంఖ్యలపై కాబూల్ నుంచి వెంటనే స్పందన రాలేదు. గత గురువారం నుంచి ఇరుదేశాలు పరస్పరం భారీ నష్టాలు కలిగించామని చెబుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా అప్ఘనిస్తాన్ ఆదివారం దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి సరిహద్దు వెంట పాకిస్థాన్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సోమవారం తరార్ మాట్లాడుతూ ఇప్పటివరకు 435 మంది అఫ్గాన్ సిబ్బంది మృతి చెందారని, 31 స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అనుమతించబోమంటున్న...
అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనాయతుల్లా ఖవారిజ్మీ ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. “మా భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఎవరికీ అనుమతించం” అని స్పష్టం చేశారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ దాడులకు ప్రతిస్పందనగా సుమారు డజను స్థావరాలను ధ్వంసం చేసి, నలుగురు పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది అఫ్ఘాన్ సైనికులు మృతి చెందగా, నలభై రెండు మంది గాయపడ్డారని చెప్పారు. అప్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మాట్లాడుతూ పాకిస్థాన్ అప్ఘాన్ గగనతలాన్ని ఉల్లంఘించి కాబూల్, లఘ్మాన్, నంగర్‌హార్, పక్తియా, కందహార్, కునార్ ప్రావిన్సుల్లో ఇళ్లు, మసీదులు, మదర్సాలు వంటిపై దాడులు చేశారని ఆరోపించారు. శరణార్థి శిబిరాలు కూడా లక్ష్యంగా చేశారని చెప్పారు. ఈ దాడుల్లో నూటపది మంది పౌరులు మృతి చెందారని, వారిలో అరవై ఐదు మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. “ప్రజల రక్షణ మా హక్కు. ఈ దాడులు ఆగే వరకు ప్రతిఘటన కొనసాగుతుంది” అని అన్నారు.
పౌరులే లక్ష్యంగా...
అఫ్ఘనిస్తాన్‌లోని యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆప్ఘనిస్తాన్ తక్షణ కాల్పుల విరమణ కోరింది. ఘర్షణలు ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభాన్ని మరింత దిగజారుస్తున్నాయని హెచ్చరించింది. ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటివరకు కనీసం 146 మంది పౌరులు ప్రభావితమయ్యారని, అందులో 42 మంది మృతి చెందగా 104 మంది గాయపడ్డారని ప్రాథమిక గణాంకాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఈ పరిణామాలపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి స్పందించారు. అఫ్ఘాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకునే ముందు అన్ని రకాల దౌత్య ప్రయత్నాలు చేశామని చెప్పారు. పాకిస్థాన్‌లో దాడులకు కారణమైన గుంపులను అఫ్గాన్ ప్రభుత్వం నిరాయుధీకరించాలని కోరారు. పాకిస్థాన్ ఈ చర్యలను అఫ్ఘనిస్తాన్‌తో ‘తెరచిన యుద్ధం’గా పేర్కొనడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగించింది. సరిహద్దు ప్రాంతం ఇంకా మిలిటెంట్ సంస్థల ప్రభావంలోనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉన్నాయి.
ఇస్తాంబుల్ చర్చలు..
ఇటీవలి నెలల్లో పాకిస్థాన్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. వాటికి నిషేధిత సంస్థ తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. ఈ సంస్థ పాకిస్థాన్‌లోనూ, అఫ్గాన్ భూభాగం నుంచీ కార్యకలాపాలు సాగిస్తోందని చెబుతోంది. అయితే టిటిపికి తాము ఆశ్రయం ఇవ్వలేదని కాబూల్ ఖండిస్తోంది.గత అక్టోబరులో ఖతార్ , టర్కీ y మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ తాజా ఘర్షణలతో ముగిసింది. ఇస్తాంబుల్ చర్చలు శాశ్వత ఒప్పందానికి దారి తీయలేదు. టిటిపి సహా హింస వెనుక ఉన్న గుంపులపై అఫ్గాన్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని పాకిస్థాన్ అధికారులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News