ఇరాన్ లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి!!

ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మీద చేస్తున్న దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయం భయంగా బతుకుతున్నారు.

Update: 2025-06-18 09:30 GMT

ఇరాన్ 


ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మీద చేస్తున్న దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయం భయంగా బతుకుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ 2022లో బయటపెట్టిన వివరాల కారణంగా ఇరాన్‌లో 2,050 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్య చదువుతున్నారు. భారతదేశంలో ఎంబీబీఎస్‌ సీట్లు 1.1 లక్షలే కావడంతో ఇతర దేశాల్లో చౌకగా వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులు వెళుతున్నారు. ఇరాన్‌లో ఐదేళ్ల వైద్య విద్య ఖర్చు 14 లక్షల రూపాయల నుంచి 15 లక్షలు మాత్రమే.


విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి ఇరాన్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇరాన్‌లో పొందిన ఎంబీబీఎస్‌ పట్టాకు జాతీయ వైద్య కమిషన్‌ గుర్తింపు ఉంది. అక్కడ ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి భారత్‌లో ప్రాక్టీసు చేయవచ్చు. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న పరిస్థితుల కారణంగా భారత విద్యార్థులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

Tags:    

Similar News