ఆయన్ను చంపే ఉద్దేశ్యం మాకు లేదు: ట్రంప్
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
trump
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని, ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలిక అని అన్నారు. ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు.
బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్ సుప్రీం లీడర్‌కు హెచ్చరికలు జారీచేశారు. పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదని, తమ సహనం నశిస్తోందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాకర్లు, రక్షణ పరికరాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, అవి అమెరికా తయారు చేసిన, ఉత్పత్తి చేసిన వాటితో పోల్చలేవని కూడా ట్రంప్ వివరించారు.