తుపాను బీభత్సం - 188 మంది మృతి

వియత్నాంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో 188 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం

Update: 2025-11-07 04:28 GMT

వియత్నాంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో 188 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తీరప్రాంతాలు కాల్మేగీ తుపాను ప్రభావంతో ఇబ్బబంది పడుతున్నాయి. గురువారం రాత్రి మధ్య వియత్నాంలో తుపాను భూమిని తాకి చెట్లు విరిగిపడటం, ఇళ్లకు నష్టం కలగటం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ తుపాన్‌ ప్రభావంతో డాక్‌లాక్‌ ప్రావిన్స్‌లో ఒకరు మృతి చెందారని ప్రభుత్వ మాధ్యమాలు శుక్రవారం నివేదించాయి.

ఫిలిప్పీన్స్ లో...
తుపాను బీభత్సం కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర వాతావరణ శాఖ అధికారులు థాన్హ్‌ హోవా నుంచి క్వాంగ్‌ త్రీ వరకు ఉన్న ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించారు. ఇక ఫిలిప్పీన్స్‌లో ఈ తుపాను బీభత్సం మరింత ఘోరంగా మారింది. అక్కడ కనీసం 188 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 135 మంది గల్లంతయ్యారని, 96 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో తుపాను ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News