Amit Shah : పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా
సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు
సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తర్వాత పాకిస్తాన్ భారత్ తో జరిపిన చర్చల్లోనూ సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరినా భారత్ అంగీకరించలేదన్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందంపై...
దీనిపైమరొకసారి అమిత్ షా స్పందిస్తూ పాకిస్థాన్ నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. సింధూ నదీ జలాల ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఒప్పందంలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారని, ఒకసారి దాన్ని ఉల్లంఘిస్తే ఇక రక్షించడం కుదరదని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.