రెండు హెలికాప్టర్లు ఢీ

అమెరికా న్యూజెర్సీలోని హామన్‌టన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి.

Update: 2025-12-29 10:22 GMT

అమెరికా న్యూజెర్సీలోని హామన్‌టన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక దళాలు చర్యలు చేపట్టాయి. కాలిపోతున్న విమానం నుండి పెద్ద ఎత్తున నల్లటి పొగ వెలువడుతున్న విజువల్స్ ప్రజలను ఆందోళన కలిగించాయి. ఉదయం 11:25 గంటలకు విమాన ప్రమాదం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హెలికాప్టర్ నేలను ఢీకొనే ముందు వేగంగా గాల్లో తిరిగింది.

Tags:    

Similar News