America : వైట్ హౌస్ పక్కన కాల్పులపై ట్రంప్ సీరియస్
వైట్‌హౌస్‌కి పక్కనే నేషనల్ గార్డ్ సిబ్బందిపై జరిగిన కాల్పులను ఉగ్రదాడిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు
వైట్‌హౌస్‌కి పక్కనే నేషనల్ గార్డ్ సిబ్బందిపై జరిగిన కాల్పులను ఉగ్రదాడిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేషనల్ గార్డు సిబ్బందినే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆయన అన్నారు. “ అలాంటి చర్యలతో తమ సంకల్పం మరింత బలపడుతుందని, వెనక్కి తగ్గమని, తమ దేశ పౌరుల భద్రతే తమకు ప్రధానమని ట్రంప్ పేర్కొన్నారు. తమ రాజధానిని, నగరాలను భద్రంగా ఉంచుతామని ట్రంప్ పేర్కొన్నారు.
మరో ఐదు వందల మందిని...
ఈ ఘటన వైట్‌హౌస్‌కు అడుగు దూరంలోనే చోటుచేసుకుంది. ఇలాంటి హింసను ప్రభుత్వం అంగీకరించదని హెగ్‌సెత్ స్పష్టం చేశారు.కొత్తగా చేపట్టిన భద్రతా చర్యల భాగంగా రాజధానిలో అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బందిని పంపించాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు హెగ్‌సెత్ తెలిపారు. ఇందులో వాషింగ్టన్ డీసీ మరింత సురక్షితంగా, శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.తాజా యాంటీ-క్రైమ్ చర్యల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అయితే సేవా సిబ్బందిపై దాడి జరిగితే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.