ట్రంప్ మరో 'షాకింగ్' ప్రకటన.. ఈసారి 100 శాతం సుంకం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ నిర్ణయాలతో వార్త‌ల్లో నిలుస్తున్నారు.

Update: 2025-08-07 04:32 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ నిర్ణయాలతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. భారత్‌పై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. దీని తర్వాత భారత్‌పై సుంకం 50 శాతానికి పెరిగింది. ఆ త‌ర్వాత మ‌రో కొత్త ప్రకటన వెలువడింది. ట్రంప్ కంప్యూటర్ చిప్స్, సెమీ కండక్టర్ల దిగుమతిపై 100 శాతం సుంకం విధించాలని నిర్ణయించుకోబోతున్నట్లు చెప్పారు.

ట్రంప్ చర్య తర్వాత అమెరికాలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, గృహోపకరణాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే.. అమెరికాలో సెమీకండక్టర్లను తయారు చేసే కంపెనీలకు మినహాయింపు ఇస్తామని ట్రంప్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్‌ చిప్స్‌, సెమీకండక్టర్లపై దాదాపు 100 శాతం సుంకం విధించాలని యోచిస్తున్నామని చెప్పారు. అయితే, అమెరికాలో దీన్ని ఉత్పత్తి చేసే కంపెనీలకు ఈ సుంకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోని వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కంప్యూటర్ చిప్స్, సెమీకండక్టర్లపై భారీగా 100 శాతం సుంకం విధిస్తే, మొబైల్స్, కార్లు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఖరీదైనవిగా మారతాయి. ఈ కంపెనీల లాభాలు తగ్గుతాయి.

అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా కాలంలో, ప్రపంచవ్యాప్తంగా చిప్స్‌కు భారీ కొరత ఏర్పడింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత పరిస్థితి ఇంచుమించు అలాగే ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిప్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఆటోమొబైల్స్ మరియు మొబైల్‌లలో చిప్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

Tags:    

Similar News