మయన్మార్ లో విషాదం.. 19 మంది విద్యార్థులు మృతి

మయన్మార్ లో విషాదం నెలకొంది. రెండు ప్రయివేటు స్కూళ్లపై సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో పంధొమ్మిది మంది విద్యార్థులు మరణించారు

Update: 2025-09-14 01:58 GMT

మయన్మార్ లో విషాదం నెలకొంది. రెండు ప్రయివేటు స్కూళ్లపై సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో పంధొమ్మిది మంది విద్యార్థులు మరణించారు. మరో ఇరవై మంది వరకూ గాయాలయ్యాయి. మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో సైన్యం వైమానిక దాడులు జరపగా అది పాఠశాలపై పడింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో దాడి జరగడంతో నిద్రలోనే మృత్యువొడిలోకి వెళ్లిపోయారు. గత ఏడాది రఖైన్ లో కొంత ప్రాంతాన్ని స్వాధీనిం చేసుకున్న అరకాన్ ఆర్మీ మయన్మార్ పాలక సైన్యంతో భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

సైన్యం జరిపిన దాడుల్లో...
ఈ ఘటన క్యుక్తావ్ టౌన్ షిప్ లో జరిగింది. రెండు ప్రవేటు పాఠశాలలపై అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడిలో విద్యార్థులు మృతి చెందినట్లు అరకాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించింది. అయితే దీనిపై చిన్నారులు మరణించడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో రోజురోజుకూ హింస పెరుగుతుందని, చిన్నారులు, కుటుంబాలు దీనికి బలవుతున్నాయని యూనిసెఫ్ కూడా ఆవేదన వ్యక్తం చేసింది.


Tags:    

Similar News