ఈ నెల 14న భూమి మీదకు శుభాంశు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా భూమి పైకి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది

Update: 2025-07-11 04:09 GMT

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా భూమి పైకి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది. ఈ నెల 14న భూమికి శుభాంశు శుక్లా. తిరిగి రానున్నారు. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు గత నెల 25వ తేదీన ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ లోకి బయలుదేరి వెళ్లారు. పథ్నాలుగు గంటలుప్రయాణించి ఐఎస్ఎస్ కు చేరుకున్నారు.

230 సూర్యోదయాలను...

ఇప్పటి వరకూ శుభాంశుశుక్లా బృందం 233 అధ్యయనాలను చేసింది. రెండు వారాల నుంచి అంతరిక్షంలోనే ఉన్న శుభాంశు శుక్లా బృందం 230 సూర్యోదయాలు చూశారు. 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. యాక్సియం స్పేస్ ప్రకటన మేరకు ఈ నెల 14న శుభాంశు శుక్లా బృందం భూమిపైకి రానుంది.తాము చేసిన అధ్యయనాలకు సంబంధించిన నివేదిక అందించనున్నారు.


Tags:    

Similar News