మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ స్టార్ నిర్జీవంగా పడి ఉండగా

అతని మరణానికి కొన్ని గంటల ముందు కూపర్ బెడ్‌పై పడుకున్న వీడియోను షేర్ చేశాడు

Update: 2022-06-12 08:12 GMT

19 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ కూపర్ నోరీగా మరణించాడు. నోరీగాకు టిక్ టాక్ లో 1.7 మిలియన్లకు పైగాఫాలోవర్స్ ఉన్నారు. లాస్ ఏంజిల్స్ మెడికల్ ఎగ్జామినర్-ఆఫీస్ ప్రకారం, కూపర్ నోరీగా లాస్ ఏంజిల్స్ మాల్ పార్కింగ్ స్థలంలో చనిపోయినట్లు గుర్తించారు. అతని మరణానికి కారణం ఇంకా కనుగొనబడలేదు మరియు కేసు దర్యాప్తులో ఉంది.

అతని మరణానికి కొన్ని గంటల ముందు కూపర్ బెడ్‌పై పడుకున్న వీడియోను షేర్ చేశాడు. లాస్ ఏంజిల్స్ మెడికల్ ఎగ్జామినర్-ఆఫీస్ ప్రకారం, కరోనర్ నోరీగా జూన్ 9న లాస్ ఏంజిల్స్ మాల్ పార్కింగ్ స్థలంలో చనిపోయాడని కనుగొన్నారు. TMZ ప్రకారం కూపర్ ను హత్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని తెలిపింది. ఎటువంటి ఫౌల్ ప్లే అనుమానించబడలేదు. కూపర్‌ TikTok లో ఫన్నీ స్కేట్‌బోర్డింగ్, ఫ్యాషన్ వీడియోలను పోస్ట్ చేశాడు. అతను 427,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. తనను తాను ఫ్యాషన్ మోడల్‌గా పేర్కొన్నాడు. అతను టిక్‌టాక్ స్టార్స్ Jxdn, నెస్సాతో కలిసి పనిచేశాడు. మానసికంగా అతడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లు తేలింది.


Tags:    

Similar News