అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ ఆదివారం ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం గడువు లోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. “హోర్ముజ్ తెరవకపోతే ఇరాన్ నరకంలో బతుకుతుంది” అని వ్యాఖ్యానించారు. ఇరాన్ వైపు నుంచి కూడా ప్రతిస్పందన వచ్చింది. పొరుగు గల్ఫ్ అరబ్ దేశాల్లో మౌలిక సదుపాయాలపై దాడులు చేపట్టింది. మరో కీలక మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి వద్ద రాకపోకలు ఆపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ యుద్ధం ఐదు వారాలు దాటింది. వేలాది మంది మరణించారు. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇంధన ధరలు పెరిగాయి. ఇలాంటి గడువులు ట్రంప్ గతంలో కూడా పెట్టిన సందర్భాలు ఉన్నా, మధ్యవర్తిత్వ ప్రయత్నాల పేరుతో పొడిగించిన సందర్భాలు ఉన్నాయి.
ఇరాన్ ప్రతి హెచ్చరిక...
టెహ్రాన్‌లో అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధులతో మాట్లాడిన ఇరాన్ సాంస్కృతిక మంత్రిసయ్యద్ రెజా సాలిహి-అమీ, “ట్రంప్ వైఖరి విరుద్ధ ధోరణులతో నిండింది. ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడం అమెరికా, ఇరాన్ రెండింటికీ కష్టమే” అన్నారు.ఇరాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ ట్రంప్ హెచ్చరికలను “యుద్ధ నేర సంకేతాలు”గా అభివర్ణించింది. ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్, తమ చమురు క్షేత్రాలు లేదా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే ప్రాంతీయ చమురు కేంద్రాలపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది.
అమెరికా రక్షణ చర్యల వివరణ...
శుక్రవారం ఇరాన్ భూభాగంలో F-15E Strike Eagle కూలిన ఘటన తర్వాత గాలింపు చర్యలు ఉత్కంఠగా సాగాయి. గాయపడిన పైలట్‌ను కొండల్లో లోతైన ప్రాంతం నుంచి రక్షించామని ట్రంప్ తెలిపారు. మరొక సిబ్బంది సభ్యుడిని కొన్ని గంటల్లోనే వెలికితీశామని చెప్పారు.ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపిన ప్రకారం, రెండో పైలట్ స్థానం తెలియకముందే సీఐఏ ఇరాన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి గందరగోళం సృష్టించింది.అదే రోజు మరో అమెరికా యుద్ధవిమానం A-10 Thunderbolt II కూడా కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ విమానం సిబ్బంది పరిస్థితి స్పష్టంగా లేదు. ఇరాన్ ప్రభుత్వ టీవీ, రక్షణ చర్యల్లో అమెరికా రవాణా విమానం, రెండు హెలికాప్టర్లు కూల్చివేశామని వీడియో ప్రసారం చేసింది. అయితే ప్రాంతీయ గూఢచారి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సాంకేతిక లోపంతో రెండు రవాణా విమానాలను అమెరికా స్వయంగా ధ్వంసం చేసిందని సమాచారం.
కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు...
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, వాయువు రవాణాకు కీలకం. ఇరాన్ అధ్యక్ష ప్రతినిధి సయ్యద్ మొహమ్మద్ మెహదీ తబతబాయి జలసంధి తెరవాలంటే యుద్ధ నష్టాలకు రవాణా ఆదాయంలో భాగం ఇవ్వాలని పేర్కొన్నారు.ఇరాన్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతి కూడా బాబ్ ఎల్ మండెబ్ మార్గాన్ని భంగం చేయగలమని హెచ్చరించారు. ఒమన్ n విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, ఇరాన్–ఒమాన్ ప్రతినిధులు సమావేశమై రాకపోకలు సజావుగా కొనసాగేందుకు ప్రతిపాదనలు చర్చించారు.
టెహ్రాన్‌పై వైమానిక దాడులు...
సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై వరుస వైమానిక దాడులు జరిగాయి. పేలుళ్ల శబ్దాలు రాత్రంతా వినిపించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఖోర్ ఫక్కాన్ పోర్ట్ వద్ద ఇరాన్ క్షిపణి మిగులు భాగాలు పడి అగ్ని ప్రమాదం జరిగింది. రువైస్ పెట్రోకెమికల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. కువైట్ లో డ్రోన్ దాడులతో విద్యుత్ కేంద్రాలు, ఉప్పునీటి శుద్ధి కేంద్రాలు దెబ్బతిన్నాయి.ఇజ్రాయిల్ లోని హైఫా నగరంలో అపార్ట్‌మెంట్‌పై దాడి జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడిలో నలుగురు మరణించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 1,900 మందికిపైగా మరణించారు. లెబనాన్‌లో 1,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్, అమెరికా సైనికుల మరణాల సంఖ్య కూడా పెరిగింది.