Nepal : నేపాల్ లో మరోసారి కాల్పులు

నేపాల్ లో మరోసారి కాల్పులు జరిగాయి. అయితే జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న సమయంలో పోలీసులు ఈ కాల్పులు జరిపారు

Update: 2025-09-11 07:50 GMT

నేపాల్ లో మరోసారి కాల్పులు జరిగాయి. అయితే జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న సమయంలో పోలీసులు ఈ కాల్పులు జరిపారు. రామెచాప్ జైలు నుంచి ఖైదీలు పరారవుతున్న సమయంలో ఖైదీలపై భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. గురువారం జైలు నుంచి ఖైదీలు పారిపోతున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయాని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ ధామా తెలిపారు. ఆర్మీ బలగాలు జరిపిన కాల్పుల్లో చాలా మంది ఖైదీలు గాయపడ్డారని పేర్కొన్నారు.

ఖైదీలు పారిపోతున్న సమయంలో...
ఖాఠ్మండు, పోఖరా, లలిత్ పూర్ జైళ్ల నుంచి ఇప్పటికే వందల సంఖ్యలో ఖైదీలు పరారయ్యారు. ఒక వైపు జెడ్ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఖైదీలు ఇదే అదనుగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపు చేసేందుకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారు . ఈ కాల్పులతో మరోసారి నేపాల్ లో ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి.


Tags:    

Similar News