తక్కువ ఉన్నాయి.. డబ్బులు పంపించండి నాన్నా
డాలర్స్ డ్రీమ్ లో పడి అమెరికాకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
డాలర్స్ డ్రీమ్ లో పడి అమెరికాకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంచెం డబ్బుతో అక్కడకు వెళ్లి పార్ట్ టైమ్ చేసుకుంటూ ఖర్చులకు డబ్బులు సంపాదించుకుందామనుకుంటే అక్కడి పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు చాలా కష్టాలే తెచ్చాయి. అంతేకాకుండా విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడంతో చదువుకోవడం కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లడంతో భారత్‌లోని తల్లిదండ్రులను విద్యార్థులు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఫోన్ చేసి డబ్బులు పంపండని అడుగుతున్నారు.పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చులకు సంబంధించి నానా కష్టాలు పడుతున్నారు.