ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య చేతుల్లో దెబ్బలు.. అందరూ చూసేశారుగా!!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టాల మధ్య విబేధాలు వచ్చాయని ఫ్రెంచ్ మీడియా చెబుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టాల మధ్య విబేధాలు వచ్చాయని ఫ్రెంచ్ మీడియా చెబుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వియత్నాంలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా విమానంలో నుంచి కిందకు దిగుతుండగా మెక్రాన్ సతీమణి బ్రిగెట్టా ఆయన్ను చెంపపై కొట్టినట్లుగా వీడియో వైరల్ అయ్యింది. ఈ దృశ్యం రికార్డు అవుతున్నట్లు గమనించి మెక్రాన్చిరునవ్వుతో చేయి ఊపారు.
ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకుని బ్రిగెట్టా విమానం మెట్లపై కనిపించారు. ఈ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. మెక్రాన్ పై ఆయన సతీమణి కావాలని చేయిచేసుకోలేదని, అది టీజ్ చేసేందుకు అలా కొట్టిందని వివరణ ఇచ్చింది.