Earth Quake : తైవాన్ లో తీవ్ర భూకంపం.. వణికిపోయిన ప్రజలు
తైవాన్ లో తీవ్ర వ్ర భూకంం ప్రజలను వణిరకించింది
తైవాన్ లో తీవ్ర వ్ర భూకంం ప్రజలను వణిరకించింది. శనివారం అర్ధరాత్రి తైవాన్‌ను 7.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైన ఈ భూకంపం వల్ల దీవి దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి అని ఫోకస్ తైవాన్ తెలిపింది.తైవాన్ కేంద్ర వాతావరణ శాఖ వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.05 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం యిలాన్ కౌంటీకి తూర్పున సముద్రంలో, సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. భూకంపం లోతు సుమారు 73 కిలోమీటర్లుగా గుర్తించారు.
ఈ ప్రాంతాల్లో అధికంగా...
తైపే, న్యూ తైపే, తైచుంగ్, తాయుయాన్, తైనాన్ నగరాలతో పాటు హువాలియన్, యిలాన్, హ్సిన్‌చు, మియావోలీ, నాంటౌ, చాంగ్‌హువా, యున్‌లిన్, తైటుంగ్, చియాయి జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. కీలోంగ్, హ్సిన్‌చు, చియాయి నగరాల ప్రజలు భూప్రకంపనలకు లోనయ్యారు. ఈ ప్రాంతాల్లో తైవాన్ ఏడు స్థాయిల తీవ్రత స్కేల్‌పై గరిష్ఠంగా 4 స్థాయి తీవ్రత నమోదైంది. యిలాన్ కౌంటీలో తీవ్రత 4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు, ఉత్తర, మధ్య తైవాన్‌లో విస్తృతంగా కంపనలు కనిపించాయని తైపే టైమ్స్ తెలిపింది.
దక్షిణ తైవాన్ లో కొంత తక్కువగా...
దక్షిణ తైవాన్‌లో తీవ్రత కొంత తక్కువగా ఉంది. కౌషియుంగ్, పింగ్టుంగ్ జిల్లాల్లో తీవ్రత 3గా నమోదైంది. దూర ప్రాంతాల్లో లియెన్‌చియాంగ్, పెంగ్‌హు కౌంటీల్లో 2 స్థాయి, కిన్‌మెన్ కౌంటీలో 1 స్థాయి తీవ్రత నమోదైనట్లు సమాచారం. భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సమాచారం లేదని అధికారులు తెలిపారు. తైపే సహా పలు నగరాల్లో భూమి దద్దరిల్లడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ లో తరచూ భూప్రకంపలను భయాందోళనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.