శ్రీలంకలో సోషల్ మీడియా సేవలపై నిషేధం

శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం రోజురోజుకీ ముదిరిపోతోంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన బాటపట్టారు.

Update: 2022-04-03 07:35 GMT

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం రోజురోజుకీ ముదిరిపోతోంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన బాటపట్టారు. అధ్యక్షుడు రాజ్ పక్సే పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశ శాంతి, భద్రతలను కాపాడేందుకు శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు.

తాజాగా.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై అసత్య ప్రచారాలు జరగకుండా ఉండేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా పై నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. గత అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఎవరైనా నిరసనలకు దిగితే.. వారిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం భద్రతా బలగాలను ఆదేశించింది.


Tags:    

Similar News