ప్రతి రాత్రి 2400 కోట్లు ఖర్చు.. ఎన్నాళ్లకు అయిపోతుందంటే?

ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్థికంగా తీవ్ర భారం మోస్తోంది.

Update: 2025-06-19 13:15 GMT

Iran

ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్థికంగా తీవ్ర భారం మోస్తోంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణకు ఇజ్రాయెల్ ప్రతి రాత్రి దాదాపు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది.


ఇరాన్‌ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోందని పలు మీడియా సంస్థలు తెలిపాయి. ఇరాన్‌ క్షిపణుల ప్రవాహం ప్రతిరోజూ కొనసాగుతుండడంతో ఇజ్రాయెల్‌ వద్ద గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. అమెరికా నుంచి వెంటనే మద్దతు అందని పక్షంలో ఇజ్రాయెల్‌ వద్ద క్షిపణి విధ్వంసక వ్యవస్థ మరో 10 నుంచి 12 రోజులకు మించి ఉండదు.

Tags:    

Similar News