దక్షిణ కొరియాలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే 6 లక్షలకు పైగా కొత్త కేసులు !

బుధవారం దక్షిణ కొరియాలో 4 లక్షల కొత్తకేసులు నమోదవ్వగా.. గురువారానికి ఏకంగా 55 శాతం కేసులు పెరిగాయి. గురువారం ఒక్కరోజే..

Update: 2022-03-17 06:53 GMT

దక్షిణ కొరియా : రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి పీడ ఇక వదిలినట్లేనని అంతా భావిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియాలో నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. దక్షిణ కొరియాలో రోజువారి కరోనా కేసులు లక్షల్లో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు చైనాలోనూ రెండేళ్ల గరిష్ఠానికి కరోనా కేసులు నమోదవుతున్నాయి.

బుధవారం దక్షిణ కొరియాలో 4 లక్షల కొత్తకేసులు నమోదవ్వగా.. గురువారానికి ఏకంగా 55 శాతం కేసులు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 6,21,328 కొత్తకేసులు వెలుగు చూశాయి. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ విడుదల చేసిన గణాంకాల్లో.. గడిచిన 24 గంటల్లో అక్కడ కరోనాతో 429 మంది మరణించినట్లు ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దక్షిణకొరియాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 82,50,592కు చేరింది. మార్చి మధ్య నాటికి అక్కడ కరోనా కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేయగా.. వారి అంచనాలకు మించి కేసులు నమోదవ్వడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.





Tags:    

Similar News