ఇస్కాన్ దేవాలయంలో కాల్పుల ఘటన కలకలం
అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు ఘటన కలకలం సృష్టించాయి. అమెరికాలో రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఆదేశించారు. అయితే కాల్పులు ఎవరు జరిపింది అనేది తెలియరాలేదు.
దర్యాప్తు చేయాలని...
హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందిన రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయం లోపల భక్తులు ఉండగా దుండగుల కాల్పులు జరిపారు. కానీ భక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 20 నుంచి 30 బుల్లెట్లు ఆలయ గోడల్లోంచి దూసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై అమెరికన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం వేట సాగిస్తున్నారు.