గర్భవతి కావడంతో 60 ఏళ్ల కిందట డిగ్రీ పట్టా ఇవ్వలేదు.. 88 ఏళ్ల వయసులో ఎట్టకేలకు!!

1959లో డిగ్రీని పూర్తీ చేయాలని అనుకుంది. అయితే అనుకున్నట్లుగా జరగలేదు.

Update: 2025-06-07 12:15 GMT

1959లో డిగ్రీని పూర్తీ చేయాలని అనుకుంది. అయితే అనుకున్నట్లుగా జరగలేదు. అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. ఆమె కుమార్తె తన తల్లికి డిగ్రీ పట్టా ఇప్పించాలని అనుకుంది. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం న్యూహాంప్‌షైర్‌కు చెందిన జోన్‌ అలెగ్జాండర్‌ 88 ఏళ్ల వయసులో డిగ్రీని అందుకోగలిగారు. ఈమె మెయిన్‌ యూనివర్సిటీలో సైన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో 1950ల్లో చేరారు. 1959 కల్లా ఈ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంది. పట్టా చేతికి రావాలంటే కోర్సు చివర్లో విద్యార్థులు కొద్దికాలం పాటు ఉపాధ్యాయులుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అప్పటికి గర్భవతిగా ఉన్న జోన్‌ను అధికారులు బోధించేందుకు అనుమతించలేదు. దీంతో డిగ్రీ పట్టాను అందుకోలేకపోయింది జోన్‌.

జోన్‌ కుమార్తె ట్రేసీ తల్లి డిగ్రీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. డీన్‌గా ఉన్న జస్టిన్‌ డిమ్మెల్‌ సానుకూలంగా స్పందించారు. 1980ల్లో జోన్ ఓ ప్రీ స్కూల్ లో పూర్తిస్థాయి సహాయకురాలిగా పనిచేసినట్లుగా గుర్తించారు. ఈ అనుభవాన్ని బోధనతో సమానమైన అర్హతగా భావించి, జోన్‌ అలెగ్జాండర్‌కు డిగ్రీ పట్టాను అందించారు.

Tags:    

Similar News