గాల్లోనే శృంగారం.. వీడియో వైరల్ అవ్వడంతో బహిష్కరణ

తనతో శృంగారంలో పాల్గొంటే సెక్స్‌కు బదులుగా అదనపు గంటలు విమానాలు నడిపే అవకాశం ఇస్తానని పైలట్ వాగ్దానం..

Update: 2022-05-27 04:43 GMT

రష్యా : కాక్‌పిట్‌లో మహిళా ట్రైనీతో రొమాన్స్ లో పాల్గొన్న రష్యా పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ ఒక విద్యార్థినితో రొమాన్స్ లో పాల్గొన్నాడు. విమానాన్ని ఆటోపైలట్‌ మోడ్ లో పెట్టి మరీ అతడు ఆమెతో రొమాన్స్ లో మునిగిపోయాడు. ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆమెతో రాసలీలకు దిగాడు.

తనతో శృంగారంలో పాల్గొంటే సెక్స్‌కు బదులుగా అదనపు గంటలు విమానాలు నడిపే అవకాశం ఇస్తానని పైలట్ వాగ్దానం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 28 ఏళ్ల పైలట్ రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానాన్ని నడుపుతున్నాడు. 21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్న పైలట్ తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. అందుకు ఆమె అంగీకరించడంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు. ఆ ట్రైనీ పైలట్ తన తోటి కేడెట్‌తో గొడవపడింది. దీంతో మరో యువతి ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చేసింది.
మరో విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ కావడంతో ఫ్లైట్ స్కూల్ వారిద్దరినీ తొలగించింది. వీడియో సోషల్ మీడియాలో పెట్టకముందే మహిళబయటకు వచ్చేసిందని నివేదికలు వచ్చాయి. ఆ వ్యక్తికి వివాహమవ్వడంతో వీడియో చేయడానికి మహిళ మొదట నిరాకరించిందని, అయితే అతను ఆమెకు అదనపు తరగతులు ఏర్పాటు చేసిన తర్వాత అంగీకరించిందని నివేదికలు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ పైలట్‌ను, ట్రైనీ పైలట్‌ను బహిష్కరించింది.


Tags:    

Similar News