నదిలో కూలిపోయిన పోలీసుల హెలికాప్టర్

మలేషియాలోని జోహోర్ పులాయ్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది.

Update: 2025-07-11 14:15 GMT

మలేషియాలోని జోహోర్ పులాయ్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇది పోలీసు విభాగానికి చెందిన హెలికాప్టార్. ఈ ఘటనలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు మలేషియా పౌర విమానయాన శాఖ తెలిపింది. మిత్సతోమ్ 2025 పేరుతో ఈవెంట్ చేస్తుండగా తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన హెలికాప్టర్ బయలుదేరింది. గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జెట్టీ సమీపంలోకి వచ్చిన వెంటనే ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి పైలట్‌తో సహా ఐదుగురిని రక్షించాయి.

Tags:    

Similar News