Big Breaking : ఘోర విమాన ప్రమాదం.. రన్ వేపై పేలిపోవడంతో?

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు.

Update: 2024-12-29 01:43 GMT

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. మయూన్ ఎయిర్ పోర్టు రన్ వేపై విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఈ విమాన ప్రమాదం జరిగింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో 175 మంది వరకూ ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని తెలిసింది. ఈ విమానం బ్యాంకాంగ్ నుంచి మయూన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు ఎంతమనేది?
ఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మరణాలు సంbభవించి ఉంటాయని భావిస్తున్నారు. ఎవరూ బతికే అవకాశం లేకుండా విమానం పేలిపోవడం, మంటలు చెలరేగడంతో ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక లోపం ఏదైనా కారణమా? లేక మరేదైనా కారణంతో ప్రమాదం సంభవివించిందా అన్నది తెలియాల్సి ఉంది. ఎవరు మృతి చెందారన్న విషయం కూడా తెలియరావడం లేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News