కుబేరుడి పెళ్లిని అడ్డుకోడానికి ప్రజలంతా ఏకమై
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌ల వివాహానికి ఓ వైపు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌ల వివాహానికి ఓ వైపు ఏర్పాట్లు సాగుతున్నాయి. వెనిస్ నగరం దీనికి వేదిక కానుంది. ఇదే సమయంలో వేడుకను వ్యతిరేకిస్తూ స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వస్తున్నాయి. భారీగా ఖర్చుపెట్టే సంపన్నుల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఈ వివాహం కోసం వెనిస్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఎంతో ఆడంబరంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున పర్యటకుల తాకిడిపై నిరసనలు వ్యక్తం చేస్తున్న వెనిస్‌వాసులు, ఇప్పుడు సంపన్నుడి వివాహంపై మరింత అసంతృప్తిని వ్యక్తం చేశారు.