భారత్‌తో యుద్ధంలో పాక్‌కు ఆ దేశం మద్దతు ఇస్తుందా.? రక్షణ మంత్రి చెప్పిన నిజాలివే..!

పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది.

Update: 2025-09-20 06:33 GMT

పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ ఒప్పందం ప్రకారం.. ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే.. అది రెండింటిపై జ‌రిగిన దాడిగా పరిగణించబడుతుంది.

పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక ఒప్పందానికి సంబంధించి పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. దేశం మొత్తం ఈ ఒప్పందాన్ని అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ఒప్పందం గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా పాక్‌ రక్షణ మంత్రిని భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగితే సౌదీ అరేబియా కూడా ఆ యుద్ధంలో పాలుపంచుకుంటుందా, సౌదీ అరేబియా మరేదైనా దేశంతో యుద్ధం చేస్తే సౌదీ అరేబియాకు పాకిస్థాన్ మద్దతు ఇస్తుందా? అని అడ‌గ‌గా.. ఈ ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ స్పందిస్తూ.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. మేం ఏ దేశం పేరునూ ప్ర‌స్తావించ‌డం లేదు.. ఏదైనా దేశం దాడి చేస్తే, మేము ప్రతిస్పందిస్తాము.. సౌదీ అరేబియా, మేము ఏ దేశ‌పు పేరునూ ప్ర‌స్తావించ‌డంలేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఒక గొడుగు మాత్రమేనని, దీనిని ఇరు దేశాలు అందించాయని పాక్ రక్షణ మంత్రి అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏ వైపు నుంచి ఆక్రమణలు జరిగినా ఆ విషయాన్ని ఉమ్మడిగా సమర్థిస్తామన్నారు.

ఎన్‌డిటివి కథనం ప్రకారం.. జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి తాను ఎప్పుడూ నాటో వంటి ఒప్పందాలను సమర్థిస్తున్నానని చెప్పారు. తమ ప్రాంతాలు, దేశాలను రక్షించుకోవడానికి కలిసి రావడం దేశాలు, ప్రజల ప్రాథమిక హక్కు అని నేను నమ్ముతాన‌ని ఆయన అన్నారు.

Tags:    

Similar News