New Year Celebrations : అక్కడ మనకంటే ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. అయితే ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో వేడుకలు నిర్వహించుకుంటారు.

Update: 2023-12-31 11:33 GMT

నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. అయితే ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో వేడుకలు నిర్వహించుకుంటారు. కాలమాన ప్రకారం కొన్ని దేశాల్లో ముందుగానే కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంటుంది. కొత్త సంవత్సరం వేడుకలను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నిర్వహించుకునే దేశం న్యూజిలాండ్ అని చెప్పవచ్చు. పసిఫిక్ మహా సముద్రంలోని న్యూజిలాండ్ దీవుల్లో కొత్త ఏడాది వేడుకలు దేశంలోనే తొలిసారిగా అక్కడి ప్రజలు నిర్వహించుకుంటారు. న్యూజిలాండ్ లో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

పాత ఏడాదికి గుడ్ బై చెప్పడంతో...
పాత ఏడాదికి గుడ్ బై చెప్పడం.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పడం ఈ దీవుల్లోనే జరుగుతుంది. న్యూజిలాండ్ తో పాటు ఆక్లాండ్ లో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరపుకుంటారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు సమోవా, కిరిబాటి దేవులు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. అదే ప్రపంచంలో చివరిగా హోలాండ్, బేకర్ దీవులలో నూతన ఏడాది వేడుకలను నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ముందుగానే సంబరాలు జరుపుకునే దేశం న్యూజిలాండ్‌దేనని చెప్పాలి.
ఆస్ట్రేలియాతోనూ...
ఆస్ట్రేలియాలో కూడా భారత్ కంటే ముందుగానే అక్కడ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఐదున్నర గంటలు ముందుగానే కొత్త ఏడాది వేడుకలను ఇక్కడ నిర్వహించుకోవడం ప్రతి ఏడాది జరుగుతుంది. సిడ్నీ హార్బర్‌లో జరిగే కొత్త ఏడాది వేడుకలను తిలకించడానికి రెండు కళ్లూ చాలవు. అందుకే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న మనోళ్లు మనకంటే ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఛీర్స్ చెప్పేసుకుంటారు. మనదేశంలో అర్థరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఈ వేడుకలను నిర్వహిస్తారు.


Tags:    

Similar News