Nepal : నేపాల్ జైళ్ల నుంచి ఏడు వేల మంది ఖైదీల పరార్
నేపాల్ లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారయినట్లు అధికారులు తెలిపారు
నేపాల్ లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారయినట్లు అధికారులు తెలిపారు. ఆందోళన కారులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే సమయంలో నేపాల్ లోని వివిధ జైళ్లలో ఉన్న ఏడు వేల మంది పరారయినట్లు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులు నిరసనకారులు అడ్డుకునేందుకు వెళ్లగా ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
నిరసనల నేపథ్యంలో...
నేపాల్ నిరసనల కారణంగా దేశంలోని జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తా బాల సదనంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మరణించారని అదికారులు తెలిపారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఐదుగురు ఖైదీలను సిద్ధార్థనగర్ జిల్లాలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఎస్ఎస్బీ అదుపులోకి తీసుకుంది. మిగిలిన ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతునట్లు అధికారులు తెలిపారు.