అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోన్న డెల్మిక్రాన్.. మరో వేరియంటా ?

అమెరికాలో గడిచిన 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత అక్కడ ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం

Update: 2021-12-25 10:14 GMT

లక్షల కొద్దీ కరోనా కేసులతో అమెరికా, బ్రిటన్ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అగ్రరాజ్యంలో రోజువారీ కేసులే 2 లక్షలు దాటేయగా.. బ్రిటన్ లో వరుసగా రెండవ రోజు లక్షల పాజిటివ్ కేసులు నిర్థారణయ్యాయి. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత అక్కడ ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇక బ్రిటన్ విషయానికొస్తే.. ఒక్కరోజే లక్ష 20 వేల కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండవరోజు లక్షకు పైగా కేసులు బయటపడటంతో.. బ్రిటన్ వాసులంతా వణికిపోతున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇలా కేసులు నమోదవ్వడం వెనుక డెల్మిక్రాన్ ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు.

డెల్మిక్రాన్.. మరో వేరియంటా ?
డెల్మిక్రాన్ అంటే.. మరో కొత్త వేరియంట్ కాదు. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలిస్తే వచ్చేదే.. డెల్మిక్రాన్ అని వివరించారు శాస్త్రవేత్తలు. డెల్టా - ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల కలయికే డెల్మిక్రాన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్‌గా పరిగణిస్తారని ఉదహరించారు. అలాగే డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకినా.. దానిని డెల్మిక్రాన్ ఇన్ఫెక్షన్ గానే పరిగణించాలని తెలిపారు. అయితే.. ఇది చాలా అరుదుగా జరిగే కలయిక అన్న నిపుణులు.. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిలో డెల్మిక్రాన్ కనిపిస్తుందని తెలిపారు.
డెల్మిక్రాన్ లక్షణాలు
డెల్మిక్రాన్ సోకిన వ్యక్తుల్లో కూడా కాస్త అటూ.. ఇటూగా డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలే కనిపిస్తాయని తెలిపారు శాస్త్రవేత్తలు. డెల్మిక్రాన్ బారిన పడిన వారిలోనూ జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుండగా.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల మరణాల సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. కానీ.. రోగనిరోధక శక్తి లేకపోవడం, వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి డబుల్ ఇన్ఫెక్షన్‌తో ముప్పు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News