అర్ధాంతరంగానే ముగిసిన ట్రంప్.. పుతిన్ సమావేశం
అలస్కా లో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం ముగిసింది.
అలస్కా లో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం సాగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఎలాంటి ఒప్పందాలు కుదరకుండానే చర్చలు ముగిసినట్లు చెబుతున్నారు. సమావేశంలో చర్చల సరళిపై డొనాల్డ్ ట్రంప్, పుతిన్ లు వేర్వేరు వాదనలను వినిపించడమే ఇందుకు కారణం.
వేర్వేరుగా ప్రకటనలు...
సమావేశం ఫలప్రదమయిందని పుతిన్ చెబుతుండగా, ఎలాంటి ఒప్పందం కుదరలేదని ట్రంప్ చెప్పడంతో సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదని అర్థమయింది. ఉక్రెయిన్ తో యుద్ధం విరమించాలని ట్రంప్ కోరగా దానికి పుతిన్ తిరస్కరించినట్లు సమాచారం. తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని పుతిన్ చెబుతున్నారు. ట్రంప్ పెట్టిన షరతులను పుతిన్ అంగీకరించకపోవడం, పుతిన్ కూడా కొన్ని నిర్ణయాలు చెప్పడంతో దానికి ట్రంప్ విముఖత వ్యక్తం చేయడంతో సమావేశం అర్థాంతరంగా ముగిసిందని అంటున్నారు.