భూకంపం వందల మందిని మింగేసింది

ఆప్ఘానిస్తాన్ లో జరిగిన భారీ భూకంపం వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది

Update: 2023-10-08 02:42 GMT

ఆప్ఘానిస్తాన్ లో జరిగిన భారీ భూకంపం వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది. శనివారం వరసగా సంభవించిన భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు అశువులు బాశారు. దాదాపు 120 మంది భూకంపం వల్ల చనిపోయినట్లు అధికారికంగా తెలియజేశారు. వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గాయపడిన వారిలో...
గాయపడిన వారి పరిస్థిితిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారికి చికిత్స చేస్తున్న వైద్యులు చెబుుతన్నారు. ఇక ఇళ్లన్నీ నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆప్ఫాన్ - ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసర ప్రాంతంలో శనివారం వరసగా భూ ప్రకంపనాలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News