Earth Quake : తైవాన్ లో భారీ భుకంపం.. భవనాలు ఒరిగిపోవడంతో?

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రతగా నమోదు అయింది.

Update: 2024-04-03 03:24 GMT

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రతగా నమోదు అయింది. ఇప్పటికే అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఎంత మేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు.

సునామీ హెచ్చరికలు....
భూకంపానికి భవనాలు కూడా కుంగిపోయిన దృశ్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తైవాన్ లో కుంగిపోయిన ఒక బిల్డింగ్ కుంగిపోయిన దృశ్యాలు వైరల్ గా మారాయి. భూకంపం తీవ్రతకు భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ అయ్యాయి. జపాన్‌లో నీటి మట్టాలు పడిపోతున్న దృశ్యాలు, ఇది సాధారణంగా సునామీకి ముందు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News