Earth Quake : అలాస్కాలో భారీ భూకంపం
అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా నమోదయింది
అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా నమోదయింది. అలస్కాతో పాటు తజకిస్తాన్ లోనూ వరసగా భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం అస్కాలో సంభవించిన భూకంప కేంద్ర భూమికి 48 కిలోమీట్ల లోతులో ఉందని తెలిపారు.
భారత్ లోనూ...
ఈ నెల 17వ తేదీన కూడా అలాస్కాలో భూకంపం సంభవించి 7.3 తీవ్రతతో నమోదయింది. అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం దీంతో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. ప్రజలు ఎత్తు ఉన్న ప్రాంతాలకు తరలి పోవాలని కూడా సూచించారరు. భారత్ లో జమ్మూ కాశ్మీర్ లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదయింది. అలాస్కాలో ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.