అమెరికా ఆదాయానికి భారతీయుల భారీ సాయం
అమెరికాలోని ప్రవాస భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు.
అమెరికాలోని ప్రవాస భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంపన్న దేశంగా ఉన్న అమెరికాను మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారు మనోళ్లు. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్-2025’ జాబితా ప్రకారం మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. వీరిలో 12 మంది భారతీయులే కావడం విశేషం. ఈ సంఖ్యా పరంగా ఇజ్రాయెల్‌ను భారతదేశం అధిగమించింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఈ జాబితాలో నిలిచారు. సైబర్ భద్రతా సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ను నిర్వహిస్తున్న నికేశ్ అరోరా కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. 17.9 బిలియన్ డాలర్ల సంపదతో జయ్ చౌధ్రీ అగ్రస్థానంలో ఉన్నారు