సిట్జర్లాండ్ లో పెను విషాదం
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిట్జర్లాండ్ లో పెను విషాదం చోటు చేసుకుంది.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిట్జర్లాండ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ లో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. స్విట్జర్లాండ్ లోని స్కీ రిసార్ట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక మంది మరణించినట్లు తెలిసింది.
భారీ పేలుడుతో...
స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో ఈ భారీ పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం ప్రారంభమయ్యాయి. అయతే ఈ ఘటనలో ఎంత మంది మరణించారన్న దానిపై ఇప్పటి వరకూ సమాచారం లేదు. అనేక మంది బంధువులు, స్నేహితులు ఆందోళనలో ఉన్నారు.