Earth Quake : ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. ఇరవై మంది మృతి
ఫిలప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9 గా నమోదయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఫిలప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9 గా నమోదయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా ఇరవై మంది మరణించారని, వందల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భవనాలు నేలమట్టం...
సెబు ప్రావిన్స్ లోని బోగో నగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఒక్క బోగో నగరంలోనే భూకంపం కారణంగా పథ్నాలుగు మంది వరకూ చనిపోయారని అధికారుల వెల్లడించారు. ఆస్తి నష్టం భారీగా జరిగింది. భవనాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్తు సరఫరాను నిలిచిపోయింది. రోడ్డు బీటలు వారియి. కొండచరియలు విరిగపడటంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రతతో ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు